అమెరికాలో రోడ్డు ప్రమాదం..యువకుడు మృతి

8
- Advertisement -

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ యువకుడు మృతి చెందాడు. చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చంచల్‌గూడకు చెందిన షెరాజ్‌ మెహతాబ్‌ మొహమ్మద్‌(25) మృతి చెందారు.

ఆదివారం ఇల్లినాయిస్‌ ఈవెన్‌స్టన్‌ వద్ద జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. ఉన్నత అవకాశాల కోసం తమ కుమారుడు అమెరికాకు వెళ్లి చనిపోయాడంటూ షెరాజ్‌ తండ్రి అల్తాఫ్‌ మొహమ్మద్‌ కన్నీటిపర్యంతం అయ్యారు.

మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.

Also Read;AP: ఇంటి ముంగిటకే కారవాన్!

- Advertisement -