- Advertisement -
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్‌లో కోవర్టులున్నారని అనిరుధ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం అన్నారు.ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతారు…క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా ఉంటాం అని వెల్లడించారు.
మా దగ్గర చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనిరుధ్ రెడ్డి.చంద్రబాబు కోవర్టులు ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్‌లో దందాలు చేస్తున్నారు… ఆ కోవర్టుల ఇళ్లకు నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ కట్ చేస్తే వాళ్ళే చంద్రబాబు దగ్గరికి వెళ్లి బనకచర్లను ఆపమని అడుక్కుంటారు..ఈ ఆంధ్రోళ్లకు మంచిగా చెప్తే వినరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read:Ramayana:రామాయణ..గ్లింప్స్
- Advertisement -

