మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. AICC నిర్ణయం మేరకే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిపారు. ఆరు స్థానాల కోసం చాలా మంది పోటీలో ఉన్నారు అన్నారు. అధిష్టానం మా అందరి అభిప్రాయాలు సేకరించింది.. త్వరలోనే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆ రోజు వెల్లడిస్తారు అన్నారు.
ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్ తో భేటి అయ్యారు. రాష్ట్రంలో కులఘనన చేసి అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్లు బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపడం జరిగిందని మహేష్ కుమార్ కేంద్ర మంత్రికి వివరించారు.
కేంద్రం ఆమోదించి రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు.
Also Read:మ్యాడ్ స్క్వేర్..ఎన్టీఆర్ వస్తున్నాడు!

