సూపర్ స్టార్ మహేష్ బాబు కి ప్రస్తుతం బ్యాడ్ ఫేస్ నడుస్తుంది. మహేష్ కి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కొన్ని నెలల క్రితం మహేష్ అన్నయ్య ప్రముఖ నటుడు రమేష్ బాబు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితమే సినిమాలకు ఫులి స్టాప్ చెప్పేసిన రమేష్ బాబు అనారోగ్యంతో హఠాన్మరణం చెందాడు. అన్నయ్య మరణం నుండి కోలుకునే లోపే మహేష్ కి ఇంకో దెబ్బ తగిలిందని. మహేష్ తల్లి ఇందిరాదేవి గారు కూడా అనారోగ్యంతో మరణించడం మహేష్ కి తీరని లోటు మిగిల్చింది. అమ్మ అంటే మహేష్ కి ప్రాణం. సినిమా రిలీజ్ రోజు టెన్షన్ పోవాలంటే మహేష్ కి వాళ్ల అమ్మ కాఫీ పడాల్సిందే. ఇప్పుడిప్పుడే అమ్మ మరణం నుండి కోలుకుంటున్న మహేష్ కి మరో షాక్ తగిలింది.
మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు తాజాగా ఆరోగ్య సమస్యతో కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, జెనరల్ చెకప్ కోసం మాత్రమే వెళ్లారని మహేష్ టీమ్ చెప్తున్నారు. కానీ కాంటినెంటల్ హాస్పిటల్ ఎండీ గురు రెడ్డి కృష్ణ కృష్ణ ఆరోగ్యం కాస్త క్రిటికల్ గానే ఉందంటూ మీడియా కి అప్ డేట్ ఇచ్చారు. దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ కృష్ణ ఆరోగ్యం పట్ల టెన్షన్ పడుతున్నారు. మహేష్ కి తండ్రి కృష్ణ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తండ్రి ని ఎప్పుడూ ఓ గురువులా భావిస్తాడు. ప్రస్తుతం తండ్రి అనారోగ్యం పట్ల మహేష్ తో పాటు వారి ఫ్యామిలీ కూడా టెన్షన్ పడుతున్నారు.
ఇలా నెలల గ్యాప్ లో కుటుంబం నుండి ఒక్కొక్కరు అనారోగ్యం పాలు అవుతుండటం మహేష్ ను తీవ్ర ఇబ్బంది కి గురి చేస్తోంది. అమ్మ మరణం తర్వాత ఆ బాధ నుండి బయటపడేందకు ఇటీవల ఫ్యామిలీ తో అబ్రాడ్ ట్రిప్ వెళ్లి వచ్చాడు మహేష్. ఇంతలోనే తండ్రి హాస్పిటల్ పలవ్వడం సూపర్ స్టార్ ను కలవర పెడుతుంది త్వరలోనే మహేష్ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్ మొదలు కావల్సి ఉంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ షెడ్యుల్ షూటింగ్ తాజాగా కృష్ణ అనారోగ్యంతో మళ్లీ బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం కృష్ణ పూర్తి ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి బయటకు రావాలని కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..