ఆదిపురుష్‌ బాటలోనే పుష్ప 2!

131
- Advertisement -

అదేంటి ఆదిపురుష్‌ ..పుష్ప 2 సినిమాకు లీంకేంటి అనుకుంటున్నారా?. అవును మీ సందేహం నిజమే. రెండు సినిమాల జానర్లు వేరయినా ఫ్యాన్స్‌ ఆందోళన ఒక్కటే. సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వాలని. ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆది పురుష్. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసందే. ఆదిపురుష్ అప్‌డేట్ కోసం ఓ అభిమాని చనిపోయిన సందర్భం కూడా ఉంది. అయితే అలాంటి పరిస్థితి అల్లు అర్జున్ పుష్ప 2కి రాకపోయినా ఫ్యాన్స్‌ మాత్రం ఆందోళన బాటపట్టారు.

పుష్ప సీక్వెల్ అప్‌డేట్ ఆలస్యం అవుతోందంటూ హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల ఆరంభంలోనే షూటింగ్ ప్రారంభమైందని చెప్తున్నా.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదని సినిమాకు సంబంధించి అప్‌ డేట్ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. దీంతో ఇప్పుడు టీ టౌన్‌లో పుష్ప 2కి సంబంధించిన చర్చే జరుగుతోంది.

pushpa 2

పుష్ప సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది. ఇటీవల జరిగిన 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో పుష్ప మూవీకి ఏకంగా 7 అవార్డులు రావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -