మహేశ్‌ ఆ శిక్షణ కోసమే వెళ్ళాడట

27
- Advertisement -

రాజమౌళి సినిమాలో తన లుక్, మేకోవర్ కోసమే సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు జర్మనీ వెళ్లినట్టు ప్రచారం జరిగింది. తాజాగా అట్లాంటాకు చెందిన మూవీ ఫాలోవర్ క్రిస్టోఫర్ కనగరాజ్ ఓ ఫొటోను షేర్ చేశారు. మహేశ్ ప్రస్తుతం జర్మనీలోని బ్రెన్నర్స్ పార్క్-హోటల్, స్పాలో డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో శారీరక దృఢత్వానికి శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జర్మనీలో మహేశ్‌ బాబు శిక్షణ తీసుకుంటున్నాడు. ఏది ఏమైనా రాజమౌళి – మహేశ్ బాబు సినిమాపై ఆకాశమంత అంచనాలున్నాయి.

అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జక్కన్న తీస్తున్న ఈ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభం కానుంది. దీనిలో ప్రపంచ యాత్రికుడిగా మహేశ్ కనిపిస్తారని టాక్. 2027లోనే ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉందట. అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ బడ్జెట్ రూ.1000 కోట్లు. పైగా ప్రపంచ యాత్రికుడిగా మహేష్ బాబు ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నాడు.

ఎంతైనా రాజమౌళి సినిమా కాబట్టి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, రూమర్స్ కూడా ఆ రేంజ్ లోనే వస్తున్నాయి. తాజాగా, ఓ రూమర్ వినిపిస్తోంది. ఏప్రిల్ 9, 2024న తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. అన్నట్టు ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందట.

Also Read:Ram Mandir:వేద మంత్రాల మధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట

- Advertisement -