మహేష్ సినిమా నుంచి వీడియో లీక్ !

43
- Advertisement -

‘సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పైగా నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ తో పాటు రిలీజ్ డేట్‌ను సైతం చిత్రయూనిట్ రివీల్ చేసింది. మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఐతే, తాజాగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రీకరణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం లీక్ అయింది. వీడియోలో మహేష్ కారు దిగి నడుచుకుంటూ మూవ్ అవుతున్నాడు. సెట్ లో త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఇలా షూటింగ్ వీడియో లీక్ అవ్వడం విశేషం.

ఇక ఈ సినిమా మేకర్స్ ఈ వీడియోని షేర్ చెయ్యొద్దు అంటూ ఫ్యాన్స్ ను కోరుతున్నారు. ఈ సినిమా.. పాన్ ఇండియా సినిమాగా రానుంది. పూర్తి ఢిల్లీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కాబట్టి, సినిమాలో ఓ భారీ చేజింగ్ ఫైట్ ఎపిసోడ్‌ ఉందట. ఈ ఎపిసోడ్ షూట్ ను వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

పైగా ‘అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇలా వరుస హిట్ చిత్రాలను అందించి ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు త్రివిక్రమ్. దీనికితోడు ఈ సినిమాకి ఇండియా వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

HBD Ramcharan:హ్యాపీ బర్త్ డే రామ్‌చరణ్‌

RC15:రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’

Manchu Manoj:నిజం కోసం చావడానికైనా సిద్ధం

- Advertisement -