విదేశాల్లో మహేష్, రామ్ చరణ్ ఫ్యామిలీ సందడి..

120
Mahesh

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుటుంబం, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ దంపతులు నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జురిచ్‌ నగరంలో వీరు న్యూఇయర్‌ వేడుకల్లో మునిగిపోయారు. 2017వ సంవత్సరం సినీ అభిమానులకు కొత్తధనాన్ని పంచనుందన్న విషయాన్ని ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు చెప్పకనే చెప్తున్నారు. తమ మధ్య సఖ్యత, చక్కని సంబంధం ఉందనే విధంగా ప్రిన్స్ ఫ్యామిలీ, చెర్రీ ఫ్యామిలీ కలిసి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే కొన్ని ఫోటోలు హల్చల్ చేయగా, తాజాగా మరొక ఫోటో చక్కర్లు కొడుతోంది.

Mahesh

మహేష్ పై చేయి వేసి ఉన్న రామ్ చరణ్ ఫోటో ఇద్దరి హీరోల అభిమానులకు కన్నుల విందుగా మారింది. గుబురు మీసం, గడ్డంతో చెర్రీ దర్శనమిస్తుండగా, చెర్రీ తమ్ముడి మాదిరిగా లేలేత యువకుడిగా కనపడుతూ ప్రిన్స్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను మహేశ్‌ సతీమణి నమ్రత, చెర్రీ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. నిజంగా ఈ ఫోటోను పక్కనపెట్టి, వయసులో ఎవరు పెద్ద వారు? అంటే టక్కున చెర్రీ అన్న పేరు చెప్పడం సహజం… అనేటంతగా ప్రిన్స్ మెరిసిపోతున్నాడు. 2017 స్పెషల్ గా ఈ ఫోటోలు ఐ ఫీస్ట్ గా మారాయి.

Mahesh

Mahesh