మహేష్‌ 25 మొదలైంది !

184
Mahesh Babu's landmark 25th film launches
Mahesh Babu's landmark 25th film launches
- Advertisement -

సుపర్‌ స్టార్‌ మహేష్ బాబు మరో రెండేళ్ల వరకూ మహేష్ కమిట్మెంట్స్ ఇచ్చేశాడు. మురుగదాస్ తో తెరకెక్కిస్తున్న హై బడ్జెట్ బై లింగ్యువల్ మూవీ షూటింగ్ పూర్తైంది. వచ్చేనెల 27న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే తన 24 మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

తాజాగా మహేశ్ 25 వ సినిమా హైదరాబాద్ లో ప్రారంభమైంది. మహేష్ బాబు సతీమణి నమ్రతతో పాటు ఆయన పిల్లలతో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమాను లాంచ్ చేశారు. సాధారణంగా తన సినిమాల ఓపెనింగ్ కార్యక్రమాలకు మహేష్ హాజరుకాడు. అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ కొరటాలతో చేయబోయే సినిమాను కూడా మహేష్ లేకుండానే మొదలు పెట్టారు.  ప్రస్తుతం లక్నోలో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్‌లో మహేష్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Mahesh 25th movie

ఇక ఈ సినిమాలో మహేశ్ న్యూ లుక్ తో కనిపించనున్నాడనీ .. ఇంతవరకూ ఆయన చేయని పాత్రను ఈ మూవీలో చేస్తున్నాడని చెబుతున్నారు. మహేశ్ కెరియర్లో ప్రత్యేకమైన సినిమా కనుక, ఈ సినిమా విషయంలో వంశీ పైడిపల్లి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని అంటున్నారు.

Mahesh Babu's landmark 25th film launches

తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ‘ధృవ, ఊపిరి, విక్రమ్ వేద’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన పిఎస్. వినోద్ కెమెరా వర్క్ చేయనున్నారని తెలుస్తోంది. మహేశ్ మూవీ నుంచి ఆయన అభిమానులు ఆశించే కొత్తదనం ఈ సినిమాలో పూర్తిస్థాయిలో కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అశ్వనీదత్ – దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాకి, వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

 

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ దాంతోపాటే ఈ సినిమాకి కూడా పనిచేయనున్నారు. బ్రహ్మోత్సవం తరువాత స్పైడర్ కోసం చాలా గ్యాప్ తీసుకున్న మహేష్‌.. వచ్చే ఏడాది రెండు సినిమాలతో అభిమానులను ఖుషీ చేయనున్నాడు.

- Advertisement -