భరత్‌ బహిరంగ సభ.. ఏప్రిల్‌ 7న

200
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఈ చిత్రం ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీగా ఉంది. కాగా ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు రెండు సాంగ్స్‌ రిలీజ్‌ అయ్యాయి.

 Mahesh Babu's “Bharat Ane Nenu” pre-release event

భరత్‌ అనే నేను టైటిల్‌ సాంగ్‌, ‘ఐ డోంట్‌ నో’ పాటలకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ‘భరత్‌ బహిరంగ సభ’ పేరుతో ఏప్రిల్‌ 7 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్‌.బి. స్టేడియంలో ప్రేక్షకులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో వైభంగా జరగనుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి.

- Advertisement -