హ్యాపీ బర్త్ డే అమ్మా.. మహేష్‌ భావోద్వేగం..

72
mahesh
- Advertisement -

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు తన తల్లి ఇందిరాదేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈరోజు ఇందిరాదేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా మహేష్‌ భావోద్వేగంతో కూడిన పోస్టును పెట్టాడు. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా. నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ అందిస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక్కరోజు సరిపోదు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని ట్వీట్ చేశాడు.

మహేష్‌కు అమ్మ అంటే అంతులేని ప్రేమ. చిన్న తనంలో తన తండ్రి కృష్ణ షూటింగుల్లో బిజీగా ఉన్నప్పుడు మహేష్‌ ఎక్కువగా తన తల్లి, అమ్మమ్మ ప్రేమానురాగాల మధ్య పెరిగాడు. అమ్మమ్మతో కూడా మహేష్‌ చాలా అన్యోన్యంగా ఉండేవాడు. ఇక ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ అంచనాలు నెలకొన్న ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -