సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చేయనున్నాడు ప్రిన్స్. అంతేకాకుండా ఈమధ్య వ్యాపారం రంగంలో కూడా బిజీగా ఉన్నాడు. ఇటివలే ఎయంబీ పేరుతో గచ్చిబౌలిలో మల్టీప్లెక్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ఈమధ్య వెబ్ సిరిస్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించాడు. మహేశ్ బాబు రాజకీయాల్లోకి రానున్నాడని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
మహేశ్ పెదనాన్న ఆదిశేషగిరి రావు తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో మహేష్ బాబు రాజకీయ ప్రవేశంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నమ్రత ఆ విషయంపై స్పందించారు. బాబును తెరపై చూస్తే చాలునని, బాబుకి కూడా రాజకీయాలపై అస్సలు ఆసక్తి లేదని సమ్రత సమాధానం చెప్పారు. మహేష్ బాబు ఫోకస్ అంతా నటన మీదేనని, ఆయన ప్రేమించేది సినిమాలనే అని నమ్రత అన్నారు. సినిమాలు తప్ప మరో విషయం మహేష్ బాబుకు అర్థం కాదని, బాబు రాజకీయాల్లోకి రాబోరని స్పష్టం చేశారు నమ్రత.