ANR మెచ్చిన సూపర్‌ స్టార్‌ ‌..

280
Mahesh Babu
- Advertisement -

టాలీవుడ్ హీరోల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఏనాడో నిరూపించుకున్న మహేష్, తాజాగా, 106 ఏళ్ల వృద్ధురాలిని కలుసుకుని, దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.

Mahesh Babu

సుమంత్ ట్విట్టర్ లో.. పెద్దలకు మీరు ఎంతో గౌరవంను ఇచ్చే హీరో – ఆ కారణం వల్లే ఈతరం హీరోల్లో మా తాతయ్య ఏయన్నార్‌కు మీరు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది అంటూ తెలిపాడు. దీనిపై మహేష్ సైతం స్పందించాడు. “థ్యాంక్స్ సుమంత్… ఏఎన్‌ఆర్ గారు ఏన్నో విధాలుగా, ఎప్పటికీ నాకు ఆదర్శప్రాయులే” అని అన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

 

 

 

 

- Advertisement -