తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేష్…

356
Mahesh Babu visits tirupati temple,
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సూపర్ స్టార్ మహేష్‌ బాబు, గల్లా జయదేవ్, కొరటాల శివ. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌ బాబు నటించిన భరత్ అనే నేను చిత్ర విజయోత్సవంలో భాగంగా చిత్ర యూనిట్ తిరుపతికి వెళ్లారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శంచుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారుల దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. చిత్ర యూనిట్ కు స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. తిరుమల వెంకన్నని
దర్శంచుకోవడం ఈ రోజు చాలా ఆనందంగా ఉందన్నారు మహేష్‌.

Mahesh Babu visits tirupati temple,

నిన్న విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకుని, అనంతరం అన్నపూర్ణ, ట్రెండ్‌సెట్‌ మాల్‌లో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొని, అక్కడే తన అభిమానులతో కలిసి మహేష్‌ ‘భరత్‌ అనే నేను’ సినిమా చూసారు. మహేష్ అభిమానులు అధిక సంఖ్యలో చేరుకుని స్వాగతం పలికారు.

మరో వైపు భరత్ విజయోత్సవ సభా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తిరుపతిలో ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల కారణంగా భరత్ విజయోత్సవ సభను వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మరో రోజు సభ నిర్వహిస్తామని, ముందుగానే ఆ రోజు ఎప్పుడనేది తెలియజేస్తామన్నారు. ఇప్పటికే రూ.125 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన భరత్ రూ.150 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తుంది. మహేష్ తన తదుపరి చిత్రాన్ని వంవీ పైడిపల్లితో చేయనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -