మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ తెల్ల పంచె, తెల్ల చొక్కా వేసుకుని ట్రెడిషనల్ లుక్‌లో కాసేపు కనిపించనున్నాడని, దానికి సంబంధించిన టెస్ట్ లుక్ కూడా ఇప్పటికే జరిగిందని.. ఈ లుక్ గుంటూరు కారం ఇంటర్వెల్ సీక్వెన్స్ లో చాలా గ్రాండ్ గా మాస్ ఎలివేషన్స్ తో వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్ బాబు.. తన తర్వాతి సినిమాను దర్శక ధీరుడు రాజమౌళితో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా గురించి ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది. మహేష్ బాబు ఈ సినిమా కోసం ఏకంగా రూ. 110 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. నిజంగా మహేష్ కి అంత భారీ రెమ్యునరేషన్ ఇస్తే.. అది సరికొత్త రికార్డు అవుతుంది.
ఏది ఏమైనా సహజంగా రాజమౌళి మూవీ కోసం హీరోలు కాంప్రమైజ్ అవుతారు. తక్కువ రెమ్యునరేషన్ తో పాటు కాలాన్ని కూడా ఎక్కువ కేటాయించాలి. కానీ, మహేష్ కి మాత్రం భారీ రెమ్యూనరేషన్ అందుతుంది. ఇక నటి రేణూ దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో తనకు బ్యాంకు ఆఫీసర్ పాత్ర వచ్చిందని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయానని అన్నారు. దానికి కారణం చెప్పాలని ఉంది కానీ కాంట్రవర్సీలు అవుతాయని చెప్పలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. ఐతే, మహేష్ బాబే ఆ పాత్రకు ఆమెను తీసుకోకుండా చూసుకున్నారని టాక్ నడుస్తోంది.
Also Read:శ్రీలీల – కాజల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?