మహేష్ బాబు కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు.. వారం రోజుల్లోనే రూ.161 కోట్ల గ్రాస్ సాధించిందంటూ చిత్ర బృందం ఇచ్చిన ప్రకటనలు కొంచెం అతిశయోక్తిగా అనిపించాయి. భరత్ అనే నేను’ చిత్ర బృందం ఈ ఉదయం యాదగిరిగుట్టకు వచ్చి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకోనుంది. ఈ బృందంలో మహేష్ బాబు కూడా ఉండటంతో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో కొండపైకి చేరుకోవడంతో సందడి నెలకొంది.
ఓవైపు లక్ష్మీ నరసింహుని జయంతి ఉత్సవాలు గుట్టపై అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ, మహేష్ బాబుతో పాటు కొరటాల శివ, చిత్ర టీమ్ స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. మహేష్ బాబు రాకను పురస్కరించుకుని రద్దీ పెరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. కాగా, సినిమా విడుదల తరువాత మహేష్ బాబు తొలుత విజయవాడ కనకదుర్గమ్మను, ఆపై తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శించుకున్న సంగతి తెలిసిందే.