తొలిసారి…మహేష్ త్రిపాత్రాభినయం!

390
mahesh babu
- Advertisement -

సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టారు సూపర్ స్టార్ మహేష్. ప్రస్తుతం గీతాగోవిందం దర్శకుడు పరుశరాంతో తన 27వ సినిమా చేస్తున్న మహేష్..తన కెరీర్‌లో తొలిసారి మూవీలో త్రిపాత్రాభినయం చేయనున్నారట.

ప్రస్తుతం ఈ వార్త టీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ మూవీలో నమ్రత ఓ గెస్ట్ రోల్ చేయనుందని ప్రచారం జరుగుతుండగా ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రోజుకో వార్తతో మహేష్ మూవీ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.

- Advertisement -