ఈ సక్సెస్ ఉహించిందే: మహేష్ బాబు

376
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలిరోజే రూ. 47.77 కోట్ల షేర్ రాబట్టి మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్…జనవరి 11న మాకు సంక్రాంతి పండుగను ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తొలి రోజు వసూళ్లను చూసి అద్భుతంగా ఫీల్ అయ్యాం…ఇది మైండ్ బ్లాక్ ఎక్స్‌పీరియన్స్‌..మిరాకిల్ అన్నారు.

నా సినిమాను తన పిల్లలతో కలిసి చూస్తానని చెప్పిన మహేష్.. అది తన సెంటిమెంట్ అన్నారు. తన ఫ్యాన్స్ కాని.. కృష్ణ అభిమానులు కాని.. జనరల్ ఆడియన్స్ కాని మహేష్ బాబు ఏంటి అలా స్టిఫ్ అయిపోతారు అనుకున్నారు.. ఆ కథల్లో అలాగే ఉండాలి. అయితే ఈ సినిమా కథను F2 సినిమా అప్పుడు అనీల్ రావిపూడి చెప్పినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యానని చెప్పారు. తన 20 ఏళ్ల కెరియర్‌లో ఒక్క మైండ్ బ్లాక్ సాంగ్‌కి వచ్చింది. ..చాలా ఆనందంగా ఉందన్నారు మహేష్‌.

- Advertisement -