లెడీ బాస్‌..నమ్రతకి మహేశ్‌ స్పెషల్ విషెస్!

152
mahesh
- Advertisement -

టాలీవుడ్ క్రేజీ సెలబ్రిటీ జోడీల్లో మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ జంట క్రేజే వేరు. 15 ఏళ్ల క్రిందట ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకోగా ఇవాళ నమ్రత బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు మహేశ్‌.

నేడు నమ్రతా 49వ పుట్టినరోజు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు మహేశ్‌. నేను ఎంతగానో ప్రేమించే ఆ వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ప్రతిరోజు నీతో గడపడం ప్రత్యేకమైనదే.. కానీ ఈ రోజు అది మరింత ప్రత్యేకం. అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు. ప్రేమతో.. పుట్టిన రోజు శుభాకాంక్షలు లేడీ బాస్ అని ట్వీట్ చేస్తూ ఆమెతో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన ఫొటో జత చేశారు మహేష్.

ప్రస్తుతం మహేష్ బాబు, నమ్రత సహా ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార దుబాయ్‌లో ఉన్నారు. నమ్రతా పుట్టినరోజు వేడుకల అనంతరం నమ్రతా శిరోద్కర్ సహా గౌతమ్, సితార హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

- Advertisement -