భయపడే వాడే బేరానికి వస్తాడు..”సరిలేరు నీకెవ్వరు” టీజర్

562
maheshbabu sarileru neekevvaru teaser
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మీక మందన హీరోయిన్ గా నటించగా.. మాజీ ఎంపీ, సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కన్పించనున్నారు. దిల్‌రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈసినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. డైలాగ్ లు, ఫైట్లతో అదరగొట్టాడు మహేశ్ బాబు. భయపడే వాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాళ్ లేవమ్మా అనే డైలాగ్ టీజర్ లో హైలెట్గా నిలిచింది. ఈ టీజర్ మీకోసం..

mahesh Babu sarileru neekevvaru teaser out Now

 

- Advertisement -