మహేష్ తో కాజల్ రొమాన్స్

45
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మరి త్రివిక్రమ్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం గుంటూరు కారంలో స్పెషల్ సాంగ్ లో కనిపించేది కాజల్ అగర్వాల్ అని టాక్. మరి త్రివిక్రమ్, కాజల్ వైపు మొగ్గు చూపుతాడా ? లేదా ? అనేది త్వరలోనే ఉంటుంది.

ఈ సినిమా.. పాన్ ఇండియా సినిమాగా రానుంది. పూర్తి గుంటూరు నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇలా వరుస హిట్ చిత్రాలను అందించి ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు త్రివిక్రమ్. దీనికితోడు ఈ సినిమాకి ఇండియా వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా అలాగే ఓ బిజినెస్ మెన్ గా కనిపించబోతున్నాడు.

Also Read: ‘పరేషాన్’ లో గొప్ప మ్యాజిక్ జరిగింది..

రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా గుంటూరు కారం నుంచి గింప్ల్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ స్ట్రైక్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో అదిరిపోయింది. దాంతో ఈ గుంటూరు కారం పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

Also Read: భోళా శంకర్.. భోళా మ్యానియా రిలీజ్

- Advertisement -