రజనీ కోసం రంగంలోకి మహేష్..

451
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ని ఇవాళ విడుదల చేయనున్నారు.

సాయంత్రం 5:30 గంటలకు దర్బార్ మూవీ మోషన్ పోస్టర్‌ని విడుదల చేయనున్నారు మహేష్. హిందీ మోష‌న్ పోస్ట‌ర్‌ను సల్మాన్‌ఖాన్‌,మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేయనున్నారు.

రజిని కాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇక మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటుండగా ఈ సినిమా కూడా సంక్రాంతికి పోటీపడుతుండటం విశేషం.

mahesh

- Advertisement -