ప్రేమలో పడ్డాను- రాహుల్‌ సిప్లిగంజ్‌

346
Rahul-Sipligunj

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌–3 విజేతగా నిలిచి తెలుగు గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ సంచలనం సృష్టించారు. 105 రోజుల పాటు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ షోతో ప్రేక్షకుల మనసు దోచారు ఆయన. పక్కా లోకల్‌ బాయ్‌ విజయంతో నగర యువత ఉత్సాహానికి హద్దులే లేకుండా పోయాయి. విజేతగా నిలిచిన అనంతరం ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్, పలు విషయాలను పంచుకున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి చేతులమీదుగా రూ.50 లక్షలనగదుతో పాటు ట్రోఫీ అందుకోవడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటన అని.. తన జీవితంలో ఇదే పెద్ద అచీవ్‌మెంట్‌ అని రాహుల్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Rahul

తాను విజేతగా నిలిచానని తెలియగానే, మైండ్ బ్లాంక్ అయిందని, శ్రీముఖి తనను అభినందించిందా? లేదా? అన్న విషయం కూడా గుర్తు లేదని అన్నాడు. తాను పాతబస్తీకి చెందిన వాడినని గుర్తు చేస్తూ, తన ఇంటికి ఫ్యాన్స్ వెల్లువెత్తగా, గోడ దూకి బయటపడ్డానని అన్నాడు. రాత్రి పూట పాతబస్తీలో తిరుగుతూ, స్నేహితులతో కలిసి ఇరానీ చాయ్ తాగడం ఎంతో ఇష్టమని చెప్పాడు. సినిమాల్లో నటించాలన్న కోరిక తనకు లేదని, తెలుగు పాప్ ఆర్టిస్టుగానే కొనసాగుతానని రాహుల్ అన్నాడు.

ఇక తన ప్రేమ వ్యవహారం గురించి చెప్తు.. నేను ప్రేమలో పడ్డాను, అయితే, ఎవరితో ప్రేమలో పడ్డానో మాత్రం ఇప్పుడే చెప్పలేను, నేను తప్పనిసరిగా ప్రేమ వివాహమే చేసుకుంటానని రాహుల్ సిప్లిగంజ్ తెలిపాడు. తనకు, పునర్నవి మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారాలూ నడవలేదని క్లారిటీ ఇచ్చాడు.