‘ది బ్లఫ్’పై మహేష్ బాబు ప్రశంసలు!

2
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో వారణాసి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో, మహేష్ బాబు తాజాగా ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం The Bluffను చూశారు మహేష్‌. అనంతరం సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్‌పై ప్రశంసలు గుప్పించారు. ఈ చిత్రం మంచి యాక్షన్, భావోద్వేగాలతో కూడిన ఎంటర్టైనర్‌గా ఉందని పేర్కొన్నారు.

Also Read:బుర్జ్ ఖలీఫా భవనానికి మంటలు

దీనికి స్పందించిన ప్రియాంకా చోప్రా,..థ్యాంక్యూ చెబుతూ త్వరలో అంటార్కిటికాలో కలుద్దామని తెలిపింది. ఇటీవల మహేష్ బాబు జార్జియాకు వెళ్లగా, తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం అంటార్కిటికాకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కథను విజయేంద్ర ప్రసాద్ రాశారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -