కార్తీ..ఖైదీ మార్పుకు స్వాగతం: మహేష్‌

595
mahesh babu
- Advertisement -

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హీరో కార్తీగా తెరకెక్కిన చిత్రం ‘ఖైదీ’. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తెలుగు, తమిళ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను పొందింది.

తాజాగ ఈ మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్…ఖైదీ టీంను అభినందించారు. ఖైదీ.. న్యూ ఏజ్ ఫిలిమ్ మేకింగ్‌. గ్రిప్పింగ్ స్క్రిప్ట్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, అద్భుత‌మైన పెర్ఫామెన్స్‌లున్నాయని చెప్పారు.

సినిమాలో ఒక్క పాట లేదు ఈ మార్పుకు స్వాగ‌తం. కార్తి, న‌రేన్, డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌క‌రాజ్‌ స‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు మ‌హేశ్‌.

ఇక మాస్ మహారాజ రవితే సైతం ఖైదీ టీంకు అభినందనలు తెలిపారు. ఖైదీ లాంటి సినిమా తనకు చేయాలనుందని తెలిపారు.

- Advertisement -