శాతకర్ణి, ఖైదీ పై మహేష్ కామెంట్స్….!

199
- Advertisement -

చిరంజీవి, బాలకృష్ణ సినిమా విషయంలో ఫ్యాన్స్ మధ్య గొడవలు ఎలా ఉన్నా… టాలీవుడ్ హీరోల వ్యాఖ్యలు మాత్రం అందరిని కూల్ చేస్తున్నాయి. ఇద్దరు హీరోలకు ప్రతిష్టాత్మకమైన చిత్రాలు కావడంతో.. ఖైదీ, శాతకర్ణి విషయంలో ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు రెండు సంక్రాంతి బరిలో నిలవడం ఇంకా హాట్ పుట్టించింది.

Mahesh Babu praises Chiru, Balakrishna
అయితే.. రెండు చిత్రాలూ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసి అసలైన పండుగ మజాను అందించాయి. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు శాతకర్ణి, ఖైదీ సినిమాలపై స్పందించాడు. ఇద్దరు స్టార్ హీరోలకు ప్రిన్స్ శుభాకాంక్షలు తెలిపాడు.చిరంజీవి నటనా సౌరభం మంత్రముగ్ధులను చేసిందని, అన్నింటికీ మించి ఆయన అత్యున్త స్థాయిలో ఉన్నారని తెలిపాడు.

Mahesh Babu praises Chiru, Balakrishna

అంతేకాదు సర్‌.. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చాలా మిస్‌ అయ్యాం.. వెల్‌కమ్‌ బ్యాక్‌ అని రాజమౌళి లాగే కామెంట్ చేశాడు ప్రిన్స్. ఖైదీ నంబర్‌ 150 చిత్ర బృందానికి కూడా అభినందనలు అని, ట్వీట్‌ చేశారు.ఇక బాలకృష్ణ నటించిన చిత్రం గురించి మాట్లాడుతూ.. హ్యాట్సాఫ్‌ నందమూరి బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వర్ణించాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదోక అత్యుత్తమ ప్రదర్శన అంటూ కితాబిచ్చాడు. చిత్ర బృందం దృఢవిశ్వాసాన్ని, విజన్‌ను చూస్తే గర్వంగా అనిపిస్తోందని, అందరికీ అభినందనలు తెలిపాడు. చివరగా అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు అని ట్విట్ లో పేర్కొన్నాడు.

- Advertisement -