నిరాధార ఆరోపణలు సరికాదు: మహేశ్ బాబు

2
- Advertisement -

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై హీరో మ‌హేష్‌బాబు స్పందించారు. మా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల‌పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు బాధించాయన్నారు. సాటి మ‌హిళ‌పై ఒక మ‌హిళా మంత్రి అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం బాధాక‌రం అన్నారు.

వాక్ స్వాతంత్య్రం అనేది ఇత‌రుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌ర‌చ‌నంత వ‌ర‌కే ఉండాలి..ఇలాంటి నిరాధార‌మైన త‌ప్పుడు ఆరోపణ‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌ద్ద‌ని ప‌బ్లిక్ డొమైన్‌లో ఉండే వారిని నేను అభ్య‌ర్థిస్తున్నాను…మ‌న దేశంలోని మ‌హిళ‌ల‌తో, సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారితో గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో వ్య‌వ‌హ‌రించాలన్నారు.

పొలిటికల్ వార్ పేరుతో గౌరవప్రదమైన మంత్రి నీచమైన ఆరోపణలు చేయడం నన్ను భయాందోళనకు గురిచేస్తోంది. ఇది అవమానానికి మించినదన్నారు రవితేజ.రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను ఎవరూ లాగకూడదు. నాయకులు సామాజిక విలువలను పెంచాలి తప్ప వాటిని తగ్గించకూడదు అన్నారు.

Also Read:ప్రజాస్వామ్యం వన్‌ వే ట్రాఫిక్ కాదు: ఖుష్బూ

- Advertisement -