మహేష్ మరో లుక్ రివీల్ చేసిన అనిల్ రావిపూడి..

415
mahesh-look
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు 26వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

కొద్దిరోజులుగా కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటుండగా మహేష్ పిక్స్‌ లీకైన సంగతి తెలిసిందే. మహేష్ ఆర్మీ లుక్‌లో అదరగొట్టగా సెకండ్ షెడ్యూల్ ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది.

Mahesh babu Sarileru nikevaru

ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి..మహేష్‌ లుక్‌ని రివీల్ చేశారు. ఇందులో మ‌హేష్ ఆర్మీ క్యాప్ ధ‌రించి , కళ్ళ అద్దాలు పెట్టుకొని స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ లుక్ మహేష్‌ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది.

విజయశాంతి కీలకపాత్రలో నటిస్తుండగా మహేష్ బాబు ఆర్మీ మేజ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -