‘అర్జునుడు’గా మహేశ్ బాబు..!

39
- Advertisement -

సూపర్‌ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్‌ అందుకున్నాడు. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. మహేశ్ ఈ సినిమా తరువాత త్రివిక్రమ్‌తో మూవీ చేయనున్నాడు. జూన్‌ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు జోరుగా వినిసిస్తోంది. ఈ మూవీకి ‘అర్జునుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం. ఇది ఎమోషన్‌తో కూడిన యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది.

ఈ నెల 31వ తేదీన సూపర్‌ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. ఆమెకి అటు త్రివిక్రమ్ తోను .. ఇటు మహేశ్ బాబుతోను పనిచేసిన అనుభవం ఉంది. ఈ సినిమాలో మరో కథానాయికకు కూడా చోటు ఉందని అంటున్నారు. ఆ పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారట. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

- Advertisement -