మహేష్ – త్రివిక్రమ్.. ఇద్దరికీ అసంతృప్తే

38
- Advertisement -

మహేష్ బాబు సహజంగానే కమర్షియల్ గా ఉంటాడు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ మధ్య బాగా కమర్షియల్ గా మారాడు. మరి ఇంత కమర్షియల్ గా ఉన్న ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య ఎలా సింక్ అవుతుంది ?, కానీ, బలంగా సింక్ అవుతుంది అనుకున్నారు గుంటూరు కారం టీమ్ మెంబర్స్. కానీ.. వారు అనుకున్నట్లు.. ఇప్పుడు సింక్ అవ్వలేదు. ఎందుకో తెలియదు, గుంటూరు కారం సినిమా క్వాలిటీ మీద మహేష్ బాబు బాగా అసంతృప్తిగా ఉన్నాడు. ఇది గ్యాసిప్ లాంటిదే అని అనుకోవడానికి వీలు లేదు. గతంలో కూడా మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ ను పలు సార్లు పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వచ్చాడు.

తాజాగా ఈ నెల 16న నుంచి జరగాల్సిన షెడ్యూల్ ను క్యాన్సిల్ చేశాడు. ఈ షెడ్యూల్ కోసం వేసిన రెండు భారీ సెట్లు అలా పడి వున్నాయి. అసలు షూట్ చేయాల్సిన సీన్స్ విషయంలో ఎందుకు మహేష్ బాబు అంత అసంతృప్తిగా ఉన్నాడు ? ఎక్కడ లోపం జరుగుతుంది. ఇదే అర్థం కావడం లేదు త్రివిక్రమ్ కి మరియు నిర్మాత నాగవంశీకి. నిజానికి మాటల రచయితగా త్రివిక్రమ్ కి గొప్ప పేరు ఉంది. అలాంటి త్రివిక్రమ్ రాసిన మాటలు పాత వాసన కొడుతున్నాయి. మహేష్ బాబుకి త్రివిక్రమ్ రాసిన గుంటూరు కారం డైలాగ్స్ అస్సలు కనెక్ట్ కావడం లేదు. డైలాగ్స్, సెట్ లు, కాస్ట్యూమ్స్ వగైరా విషయాలపై మహేష్ బాబు నేరుగా త్రివిక్రమ్ దగ్గరే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read:ప్రభాస్ కల్కి రిలీజ్ పై క్లారిటీ

ఇక ఇప్పటికే గుంటూరు కారం 60 శాతం పూర్తి కాగా, నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, అది సాధ్యం కాదు. అసలుకే గుంటూరు నేపథ్యంలో భారీ యాక్షన్ కథతో తెరకెక్కుతోంది ఈ గుంటూరు కారం సినిమా. కాబట్టి, సినిమా నేపథ్యానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. పైగా మహేష్ బాబుకి ఈ సినిమాలో 2 షేడ్స్ కు సంబంధించి 2 డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి. కానీ మహేష్ బాబు సెట్ లో యాక్టిివ్ గా కూడా ఉండడు. కాబట్టి. షూట్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో త్రివిక్రమ్ అసంతృప్తిగా ఉన్నాడు. మొత్తానికి అటు మహేష్ కి ఇటు త్రివిక్రమ్ కి ఇద్దరికీ అసంతృప్తే.

Also Read:మోకాళ్ళ నొప్పులుంటే.. నడవకూడదా?

- Advertisement -