వంశీ పైడిపల్లి బర్త్ డే పార్టీలో మహేశ్ బాబు హంగామా..

399
mahesh-vamshi
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం మహర్షి. ఈచిత్రం మహేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈసినిమా ప్రారంభమైనప్పటి నుంచి మహేశ్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీలు చాలా క్లోజ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఇద్దరు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు కూడా వెళ్లారు. నిన్న వంశీ పైడిపల్లి బర్త్ డే వేడుకలకు కూడా హాజరయ్యారు మహేశ్ బాబు. ఆయనతో కేక్ కట్ చేపించారు మహేశ్. ఈఫోటోలను తన ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేశారు మహేశ్ బాబు. నిన్న రాత్రి సరదాగా గడిపాం..హ్యాపి బర్త్ డే వంశీ పైడిపల్లి అంటూ రానున్న రోజుల్లో నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని కామెంట్ పెట్టాడు.

ఇటివలే మహేశ్ కూతురు సితార పుట్టినరోజున కూడా వంశీ పైడిపల్లి ఫ్యామిలీతో వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

- Advertisement -