ఈ మూవీతో జ్యోతిక ‘జాక్ పాట్’ కొట్టేసినట్టే..!

352
Jackpot
- Advertisement -

తమిళ నటి జ్యోతిక రీ ఎంట్రీలో విభిన్నమైన పాత్రలకి ఓకే చెబుతూ, ముందుకు వెళ్తోంది. తాజాగా జ్యోతిక,రేవతి ప్రధానమైన పాత్రధారులుగా తమిళంలో ‘జాక్ పాట్’ చేశారు. తమిళంతో పాటు తెలుగులోను అదే టైటిల్‌తో వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందులో నటి రేవతి ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ మూవీ నుంచి తాజాగా ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఇందులో కామెడీ స‌న్నివేశాల‌తో పాటు యాక్ష‌న్ స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.పోలీస్ ఆఫీస‌ర్స్‌గా జ్యోతిక‌, రేవ‌తి అల‌రించారు. ఈ చిత్రం జ్యోతిక‌కి మ‌రో మంచి విజ‌యాన్ని అందిస్తుంద‌ని అభిమానులు అంటున్నారు. గులేభకావళి వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త, నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఆగ‌స్ట్ 2న విడుద‌ల కానుంది.

- Advertisement -