- Advertisement -
సూపర్ స్టార్‌గానే కాదు తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో ముందువరసలో ఉంటారు హీరో మహేశ్ బాబు. తాజాగా ఓ నెల రోజుల చిన్నారికి సాయం అందించి అందరిచేత శభాష్ అనిపించారు.
తూర్పు గోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు అరుదైన గుండె జబ్బుతో బిడ్డ పుట్టింది. ఆమె శరీరంలో చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మహేశ్…ఆ చిన్నారి చికిత్సకు కావాల్సిన సాయాన్ని అందించారు.
ఆంధ్రా హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్ లో గుండె ఆపరేషన్ ను వైద్యులు ఉచితంగా విజయవంతంగా చేశారు. రెండు వారాల తరువాత పూర్తిగా కోలుకోవడంతో పాపను మంగళవారం డిశ్చార్జ్ చేశారు.
- Advertisement -

