Guntur Karam:ఇలా అయితే ఎలా మహేష్?

88
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ అంటూ ఎప్పటికప్పుడు డప్పు వేయించుకునే అలవాటు గట్రా ఉన్న త్రివిక్రమ్ ప్రస్తుతం తెగ కష్టపడుతున్నాడు. అయితే తన దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న గుంటూరు కారం సినిమా షూట్ మాత్రం ఇప్పట్లో పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. మహేష్ బాబు వరుసగా వెకేషన్ లకు వెళ్తూ త్రివిక్రమ్ సినిమాకి మాత్రం డేట్లు ఇవ్వడం లేదు. దాంతో గుంటూరు కారం సినిమా షూటింగ్ బాగా లేట్ అవుతుంది.

అసలుకే గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యం కథతో తెరకెక్కుతోంది గుంటూరు కారం సినిమా. కాబట్టి, సినిమా నేపథ్యానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. అలాగే నటీనటుల మేకప్ కి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ బాబు ఇలా గ్యాప్ ఇస్తూ డేట్లు ఇస్తే… ఇక సినిమా ఎప్పటికీ పూర్తి చేయాలి ?, పైగా మహేష్ కి ఈ సినిమాలో 2 షేడ్స్ కు సంబంధించి 2 డిఫరెంట్ గెటప్స్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్.

మొత్తమ్మీద గుంటూరు కారం సినిమా చాలా స్లోగా సాగుతుంది. ఇక ఇప్పటికే గుంటూరు కారం 60 శాతం పూర్తి కాగా, నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, అది సాధ్యం కాదు. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరితో పాటు శ్రీలీల కూడా నటిస్తోంది.

Also Read:అప్పటి ముచ్చట్లు : భవిష్యత్తు ఉన్నోడివి..జాగ్రత్త

- Advertisement -