వంశీ పైడిపల్లితో మహేష్ కన్ఫామ్‌..!

382
mahesh babu
- Advertisement -

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా, రష్మికా మందన్న హీరోయిన్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత మూడు నెలల గ్యాప్ తీసుకుని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడట మహేష్. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన మహేష్…హాలీడే ట్రిప్ తర్వాత షూటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మహర్షి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మహేష్ బాబు కెరీర్‌లోనే భారీ వసూళ్లను రాబట్టగా వీకెండ్ వ్యవసాయం కాన్సెప్ట్ అందరిని ఆకట్టుకుంది.

తాజాగా మరోసారి మహేష్ – వంశీ కాంబోలో మూవీ వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -