నిర్మాతలపై దుమ్మెత్తిపోస్తున్న హీరోల ఫ్యాన్స్..!

34
heros
- Advertisement -

ఈ కరోనా వచ్చి చిత్ర పరిశ్రమను చిందరవందర చేసింది. కరోనా ఎఫెక్ట్‌తో రెండు సంవత్సరాలు సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఆ టైంలో ఇండస్ట్రీలోకి ఓటీటీ అడుగుపెట్టింది. ఇక సగటు ప్రేక్షకుడు థియేటర్‌ వేళ్లే అవకాశం చాలా వరకు తగ్గిపోయింది. ఎప్పుడైతే ఈ ఓటీటీ అనేది వచ్చిందో.. ఇండస్ట్రీలో పెను మార్పులు తెచ్చింది. ఇప్పటికే జనాలను థియేటర్ కు దూరం చేసింది. అయితే దీని వల్ల ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నిర్మాతలకు ఇన్ కమ్ సోర్స్ లాగా మారింది.ఫేడవుట్ అయిన ఆర్టిస్టులకు మంచి ప్లాట్ ఫామ్ లా ఉపయోగపడుతుంది. టాలెంట్ ఉన్న కొత్త ఆర్టిస్టులు లైమ్ లైట్ లోకి వస్తున్నారు. కానీ అదే ఓటీటీ ఇప్పుడు నిర్మాతలకు తలనొప్పి అయి కూర్చుంది. డబ్బులొచ్చే సంగతి పక్కనెడితే హీరోల ఫ్యాన్స్ నిర్మాతలపై దుమ్మెత్తిపోస్తున్నారు.

కొందరు పెద్ద నిర్మాతలు తమ లావాదేవీల కోసం ,రొటేషన్ ల కోసం తమ సినిమాలను ముందుగానే ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. దీని వల్ల వాళ్లకు కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి.దాంతో వాళ్లు ఇతర సినిమాలు నిర్మిస్తారు.కానీ ఇదే ఇప్పుడు సమస్యలు తెచ్చిపెడుతోంది.తమ హీరో సినిమాను మూడు వారాలకే ఓటీటీకి ఇస్తారా అంటూ ప్రొడక్షన్ హౌస్‌పై ఫైర్ అవుతున్నారు. ఇదంతా సర్కారు వారి పాట సినిమా గురించే.. సినిమా థియేటర్లలో బాగా ఆడుతున్నా 199 రూపాయల రెంటల్ చార్జితో అమెజాన్ లో వచ్చేసరికి ఫ్యాన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.సోషల్ మీడియాలో నిర్మాతలపై విరుచుకుపడ్డారు. నిజానికి ఫ్యాన్ ఒకటి అర్థం చేసుకోవాల్సిదేంటంటే నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామే.ఆయనకు తెలియకుండా ఎలా జరుగుతుంది అంటు ప్రశ్నిస్తున్నారు ప్రొడక్షన్ హౌస్ సభ్యులు.

ఇదిలా ఉంటే.. ఈ గొడవ తెలుసుకున్న పలువురు నిర్మాతలు తమ సినిమాలు మాత్రం 5 నుండి 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుందంటూ ప్రకటనలు చేస్తున్నారు.రీసెంట్ గా ఎఫ్3,మేజర్, పక్కా కమర్షియల్ నిర్మాతలు ముందే జాగ్రత్తపడుతున్నారు. అంతే కాదు తమ సినిమాలకు తక్కువ టికెట్ రేట్లే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఓటీటీ వచ్చిన తర్వాత జనాలు థియేటర్లకు రావడం గగనమై పోయింది. దానికి తోడు టికెట్ రేట్లు ఎక్కువ వుండటం వల్ల అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే పెద్ద నిర్మాతలైన దిల్ రాజు,అల్లు అరవింద్ లాంటి వాళ్లు సైతం మీడియా ముందుకు వచ్చి స్టేట్ మెంట్ ఇస్తున్నారు.

ఇండస్ట్రీ ఇప్పుడు కష్టకాలం లో ఉంది. మనం టికెట్ రేట్లు తగ్గించాలి, ఓటీటీలో ఆలస్యంగా సినిమాను వేయాలి. జనాలు థియేటర్లోనే సినిమాను చూడాలి. ఆ దిశగా మేకర్స్ కృషి చేయాలి. హీరోలు కూడా ప్రమోషన్ కోసం ముందుకు రావాలి. ఈ మధ్య మహేష్ బాబు లాంటి స్టార్ స్టేజిమీద డాన్సువేసాడు.ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం కోసం హీరోహీరోయిన్స్ ప్రమోషన్ లకు రావాలని అని అల్లు అరవింద్ ఓ కార్యక్రమంలో అన్నాడు.

పక్కా కమర్షియల్ మూవీ తెలంగాణలో మల్టీప్లెక్స్ లో 189 రూపాయలైతే.. సింగిల్ స్క్రీన్స్‌లో 112రూపాయలని తెలిపారు నిర్మాతలు.ఆంధ్రాలో మల్టీప్లెక్స్ లో 177 రూపాయలు కాగా, సింగిల్ స్క్రీన్స్‌లో 112గా ఉందని అనౌన్స్ చేశారు.మేజర్ సినిమాకు కూడా తక్కువ రేట్సే ఉంటాయని తెలిపారు నిర్మాతలు.రాబోయే అన్ని సినిమాలకు కూడా ఇలా టికెట్ రేట్లు తక్కువే అని అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చింది.దీనికి ఒక కారణం ఓటీటీ అయితే మరో కారణం టికెట్ రేట్లు. మొదట్లో డబ్బులెక్కువస్తాయని ఆశపడిన నిర్మాత ఇప్పుడిప్పుడే నిజం తెలుసుకుంటున్నాడు. ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి చూస్తేనే సినిమాకు నిజమైన సక్సెస్ అని నమ్ముతున్నాడు. అందుకే టికెట్ రేట్లు తగ్గించామని,ఓటీటీలో లేట్ గా వేస్తామని చెప్పుకుంటున్నారు.మరి ఇప్పటికే ఓటీటీకి బాగా అలవాటు పడ్డ ప్రేక్షకుడు మళ్లీ థియేటర్ కు రెగ్యులర్ గా రావటానికి ఎంత టైమ్ పడుతుందో చూడాలి.

- Advertisement -