గీత గోవిందం దర్శకుడితో అఖిల్

501
Akhil Akkineni.jpeg

అఖ్కినేని అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసినా అవి పెద్దగా విజయం సాధించలేదు. నటుడిగా తనకు తాను నిరూపించుకున్నా కలెక్షన్లు మాత్రం చాలా డల్ గా ఉన్నాయి. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తయింది.

ఈసినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం అఖిల్ తన తర్వాతి సినిమా కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ అఖిల్ కు ఇటివలే ఓ కథ వినిపించాడట. అఖిల్ కు కథ నచ్చడంతో వెంటనే నాగార్జునకు చెప్పాడని సమచారం.

కథలో కొత్త దనం ఉండటంతో నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. పైగా ఈసినిమాను అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున నిర్మించనున్నాడని ఫిలిం నగర్ వర్గాల టాక్. గీతా గోవిందం సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేశారు దర్శకుడు పరశురామ్. ఆనమ్మకంతోనే పరశురామ్ కు నాగార్జున అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.