మహేష్..బ్లాక్ బస్టర్ సినిమాలివే..!

459
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీతో హిట్ కొట్టిన మహేష్…ప్రస్తుతం హాలీ డే ట్రిప్‌లో ఉన్నాడు.

విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 80 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణుల అంచనా.

ఇక మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ఆయన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ మూవీల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇప్పటివరకు ఒక్కడు,అతడు,పోకిరి,మహర్షి, భరత్ అనే నేనుతో హిట్ కొట్టిన మహేష్..సరిలేరు నీకెవ్వరుతో సంక్రాంతి మొగుడు అనిపించుకున్నాడు.

- Advertisement -