- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘సర్కారు వారి పాట’. కీర్తీ సురేశ్ హీరోయిన్ నటిస్తోంది. కరోనా రెండో దశ తర్వాత సోమవారం చిత్రీకరణ పునఃప్రారంభించారు. ఈ మూవీని పరశురామ్ రూపొందుతోంది. 14 రీల్స్ ప్లస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, మహేష్ బాబు కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగు ‘దుబాయ్’లో జరిగింది.
ఆ తరువాత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతూ ఉండగా, కరోనా కారణంగా షూటింగు ఆపేశారు. కరోనా ఉద్ధృతి తగ్గడం వలన, సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగును మళ్లీ మొదలుపెట్టారు. మహేష్ బాబు తదితరులు షూటింగులో పాల్గొంటున్నారు. ‘వెన్నెల’ కిశోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు.
- Advertisement -