ఏపీ ప్రభుత్వంతో కలిసి ముందుకుసాగుతాం: మహేష్

82
mahesh
- Advertisement -

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికై జగన్ సర్కార్‌తో కలిసి ముందుకుసాగుతామని తెలిపారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మహేష్…సినిమా టికెట్ల రేట్ల‌ను స‌వరిస్తూ కొత్త జీవో ఇచ్చినందుకు జ‌గ‌న్‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్యవాదాలు తెలిపారు.

సీఎం జగన్‌ తన నిర్ణ‌యం ద్వారా తెలుగు సినీ ప‌రిశ్రమ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించారని….ప్రభుత్వానికి- సినీ పరిశ్రమకు వార‌ధిలా వ్య‌వ‌హ‌రించిన ఏపీ మంత్రి పేర్ని నాని థాంక్స్ చెప్పారు మహేష్.

మున్ముందు ఏపీ ప్ర‌భుత్వం, సినీ ప‌రిశ్ర‌మ మ‌ధ్య మ‌రింత మెరుగైన సంబంధాలు నెల‌కొనేలా ముందుకు సాగుతామ‌ని పేర్కొన్నారు.

- Advertisement -