మహేష్, చెర్రీ ఇక బిజినెస్ పార్ట్ నర్లు …!

329
Mahesh And Ram Charan, New Business Partners..!
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, రాంచరణ్ ల మధ్య బంధం రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవలే న్యూ ఇయర్‌ను స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్‌ వేడుకల్లో పాల్గొన్న మహేష్‌, చెర్రీ దంపతులు హాలీడేస్‌ను తెగ ఎంజాయ్ చేశారు. సరిహద్దులు కనిపిస్తున్నా ఎన్నున్నా మేమంతా ఒకటే అనే అర్ధం వచ్చేలా బియాండ్ బౌండరీస్ అంటూ సోషల్ మీడియా వేదికగా వీరు దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. హీరోల మధ్య విభేదాలు లేవని ఫ్యాన్స్ కూడా కలిసిఉండాలని సంకేతాన్నిచ్చారు.

ఇక తాజాగా వీరిద్దరి గురించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు మంచి మిత్రులుగా ఉన్న వీరిద్దరు త్వరలోనే వ్యాపార రంగంలో అడుగుపెట్టబోతున్నారట. ఇప్పుడు ఇదే టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల హైదరాబాదులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ ఆదివారం నాడు మహేష్ బాబు భార్య నమ్రత పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు రాంచరణ్ అతని భార్య ఉపాసన కూడా హాజరయ్యారు. దర్శకులు కొరటాల శివ, మెహర్ రమేష్ లాంటి మరికొందరు మాత్రమే ఈ పార్టీకి వచ్చారు. ఈ సందర్భంగా చెర్రీ వైఫ్ అపోల్ హాస్పిటల్ డైరెక్టర్‌ ఉపాసన ఓ ఆసక్తికర ప్రస్తావన తీసుకొచ్చిందట. మహేష్, చరణ్ ఇద్దరూ కలసి కొత్త బిజినెస్ చేస్తే బాగుంటుందని సూచించిందట.

ఈ నేపథ్యంలో చెర్రీ కూడా మహేష్ భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫైవ్ స్టార్‌ హోటల్స్‌ను ప్రారంభిస్తే బాగుంటుందన్న ప్రస్తావన తీసుకువచ్చాడట. ఇప్పటికే దీనిపై సుదీర్ఘ చర్చలు జరిగాయట. ఇప్పటికే ప్రముఖ నిర్మాత, చిరుకు అత్యంత సన్నిహితుడు సుబ్బిరామిరెడ్డి నగరంలో 7 నక్షత్రాల హోటల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్బిరామిరెడ్డి నుంచి పలు సూచనలు, సలహాలు కూడా తీసుకున్నాడట చెర్రీ. ఉపాసన, నమ్రతల మధ్య ఉన్న స్నేహమే… మహేష్, చరణ్ ల మధ్య స్నేహం బలపడటానికి కారణమని చెబుతున్నారు.

Mahesh And Ram Charan, New Business Partners..!

ఇప్పటికే రాంచరణ్ ట్రూజెట్‌తో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించాడు. అయితే, మహేష్‌కు మాత్రం బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయటం ఇదే ప్రథమం. మొత్తంగా చెర్రీ, మహేష్‌ బిజినెస్‌కు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తే మెగా, ఘట్టమనేని అభిమానులకు పండగే.

ఇక టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు సినిమాల్లో బిజీగా ఉన్న వ్యాపార రంగంలో మంచి భాగస్వామ్యులు. మాటీవీని సక్సెస్ ఫుల్‌గా రన్ చేసిన వీరిద్దరు ఇటీవలె సచిన్‌తో కలిసి ఓ కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్‌ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -