మహేష్ తో రాజమౌళి సీక్వెల్ గేమ్

1373
- Advertisement -

బాహుబలి ఫ్రాంచైజ్ తో సినిమా రెండు భాగాల ట్రెండ్ స్టార్ట్ చేశాడు రాజమౌళి. బాహుబలి 1 , బాహుబలి 2 రెండూ భారీ విజయం అందుకోవడంతో చాలా మంది రాజమౌళి ని ఆదర్శంగా తీసుకొని సీక్వెల్ ప్లాన్ చేసుకున్నారు. సుక్కు బన్నీ కాంబో మూవీ పుష్ప కూడా ముందు ఒకటే పార్ట్ అనుకున్నారు. కానీ బాహుబలి లానే సీక్వెల్ ప్లాన్ చేసుకొని పార్ట్ 1 తో మెప్పించారు.

ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. దాంతో మహేష్ తో తను చేయబోయే సినిమాకి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. జక్కన్న ముందే అన్నీ ఫిక్స్ అవుతాడు. స్క్రిప్ట్ లోనే సీక్వెల్ ప్లాన్ చేసుకుంటాడు. తాజాగా మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ఉండగానే జక్కన్న ఈ డిసిషన్ తీసుకున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో mahesh28 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ అయ్యేలోపు రాజమౌళి మహేష్ Mahesh 29 సినిమాకు సంబందించి స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తాడు. వచ్చే ఏడాది ఎండింగ్ లో ఈ కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేయనున్న ఈ సినిమాను కే ఎల్ నారాయణ నిర్మించనున్నాడు.

ఇవి కూడా చదవండి…

బాహుబలి దెబ్బకి ఆహా క్రాష్‌..

డిసెంబర్‌30…వీరయ్య పూనకాలు

పిక్ టాక్ : బికినీలో అందాల అరాచకం

- Advertisement -