కొత్త కుర్రాడు సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడుగా తెరకెక్కించిన సినిమా ‘మేమ్ ఫేమస్’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. సినిమాలో మ్యాటర్ లేదు. ముఖ్యంగా ఆకట్టుకునే విధంగా కథాకథనాలు లేకపోవడం, హీరోహీరయిన్ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు నీరసంగా సాగడం, ఇక సెకండాఫ్ లో ఎమోషన్ గాని, ఫీల్ గాని ఎక్కడా వర్కౌట్ కాకపోవడంతో మేమ్ ఫేమస్ బాగా నిరుత్సాహ పరిచింది. అయితే సినిమా టాక్ కి కలెక్షన్స్ కి మధ్య సంబంధం లేకపోవడమే ఇక్కడ హాట్ టాపిక్.
ఈ మూవీ చిన్నగా రిలీజై ఇప్పుడు పెద్ద విజయాన్ని నమోదు చేసింది. మేమ్ ఫేమస్ నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 4రోజుల్లో 01.42 కోట్ల షేర్, 2.82 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా 4రోజుల్లో 1.80 కోట్ల షేర్, 3.66 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు సాధించింది. ఇక ఐదో రోజు కలెక్షన్స్ తో కూడా కలుపుకుని చూస్తే.. 4.58 కోట్ల గ్రాస్ వచ్చింది. అసలు హిట్ అయిన చిన్న సినిమాకి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రావు. కానీ ప్లాప్ అయిన మేమ్ ఫేమస్ కి మాత్రం డీసెంట్ కలెక్షన్స్ రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం.
Also Read: Project-k:కీలక పాత్రలో స్టార్ హీరో..!
నిజానికి మేమ్ ఫేమస్ కి కలెక్షన్స్ రావడం వెనుక ప్రధానంగా ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. రెండో వ్యక్తి దర్శక ధీరుడు రాజమౌళి. మేమ్ ఫేమస్ సినిమా అద్భుతం అంటూ ఈ ఇద్దరూ తమదైన శైలిలో పాజిటివ్ కామెంట్స్ చేయడంతో.. మేమ్ ఫేమస్ కి ఊహించని సక్సెస్ దక్కింది. ప్రస్తుతం ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయి అంటే.. దానికి ప్రధాన కారణం.. రాజమౌళి మరియు మహేష్ బాబే.
Also Read: ‘నేను స్టూడెంట్ సర్’ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది..