బన్నీ వర్సెస్ మహేష్‌…

185
Mahesh and Allu Arjun to lock horns at the box office
- Advertisement -

టాలీవుడ్‌లో సంక్రాంతి వార్‌ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంక్రాంతికి సినిమా హిట్ కొడితే ఆ సంవత్సరం అంతా విజయాలను అందుకోవచ్చని హీరోలంతా భావిస్తుంటారు. దీంతో అగ్రహీరోల దగ్గరి నుంచి చిన్నహీరోల వరకు సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తిచూపిస్తుంటారు. అయితే, వచ్చే ఏడాది సంక్రాంతితో పాటు సమ్మర్‌ వేడిని మరింత పెంచేందుకు ఇద్దరు అగ్రహీరోలు ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా(భరత్ అను నేను) సంక్రాంతికి విడుదలవుతుందని అంతా భావించారు. 2018 సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు. అయితే సినిమా షూటింగు మధ్యలో కొన్ని ఆటంకాలు రావడంతో చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27, 2018లో వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇక వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకొని టాప్ ఫాంలో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..  నా పేరు సూర్యను సైతం వేసవిలో  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. టెంపర్, కిక్, రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించి వరస సక్సెస్ లు అందుకొని తొలిసారిగా మెగా ఫోన్ పడుతున్న వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుండగా వచ్చే  వచ్చే ఏడాది 2018 ఏప్రిల్ 27న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ గతంలోనే ప్రకటించింది.

ఈ నేపథ్యంలో సమ్మర్‌లో మరింత వేడిని పుట్టించేందుకు ఇద్దరు అగ్రహీరోలు ప్రేక్షకుల ముందుకురానున్నారు. అయితే, టాలీవుడ్‌లో అగ్రహీరోల సినిమాలు ఒకేసారి విడుదల కావడం కొత్తేమీ కాకపోయిన అల్లు అర్జున్,మహేష్ తలపడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. బ్రహ్మోత్సవం, స్పైడర్‌ ఫ్లాప్‌తో నిరాశలో ఉన్న మహేష్‌…శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చిన కొరటాల శివపై నమ్మకంతో ఈ సినిమాను చేయగా బన్నీ మాత్రం హ్యాట్రిక్ హిట్‌ సినిమాలతో మంచి జోష్ మీదున్నాడు. మొత్తంగా సమ్మర్‌ వార్‌లో హిట్ కొట్టేది ఎవరో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

- Advertisement -