నవంబర్‌ 10న వస్తున్న డిటెక్టివ్…

204
Vishal Detective on November 10th
- Advertisement -

యాక్షన్ సినిమాలతో మెప్పిస్తూ వచ్చిన విశాల్, ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తమిళనాడులో భారీ విజయాన్ని అందుకున్న తుప్పరివాలన్ రిమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌  10న విడుదలకానుంది. విశాల్ సరసన అనూ ఇమ్మానుయేల్, ఆండ్రియా హీరోయిన్లుగా నటించారు.

తమిళ్‌లో ‘తుప్పరివాలన్‌’ పేరుతో విడుదలై మొదటి వారంలోనే 30 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. విశాల్‌ కెరీర్‌లోనే మొదటివారం హయ్యస్ట్‌ కలెక్షన్‌ సాధించిన చిత్రంగా ‘తుప్పరివాలన్‌’ రికార్డు స ష్టించింది.

మాస్‌ హీరో విశాల్‌, అను ఇమ్మానుయేల్‌, ఆండ్రియా, ప్రసన్న, కె.భాగ్యరాజ్‌, సిమ్రాన్‌, జాన్‌ విజయ్‌, అభిషేక్‌ శంకర్‌, జయప్రకాష్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అరోల్‌ కొరెల్లి, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ వెంకట్రామన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్

- Advertisement -