ధోనీ కొత్త స్టైల్ వైరల్..

229
dhoni
- Advertisement -

మహేంద్ర సింగ్ ధోనీ చాలా కాలం తర్వాత తొలిసారి మైదానంలో అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ధోనీ కొత్త లుక్‌ అందరినీ అకట్టుకుంది. ఎప్పుడూ నీట్ షేవ్‌తో లేదంటే గడ్డం కొద్దిగా పెంచుకొని కనిపించే ధోనీ.. మొదటిసారిగా సరికొత్త స్టైల్లో గడ్డం పెంచాడు. ఏడాదికిపైగా విరామం తర్వాత క్రికెట్ ఆడుతున్న ధోనీ న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

తొలుత పొడవైన జుట్టుతో క్రికెట్ రంగ ప్రవేశం చేసిన వేళ, ధోనీ చిత్రాలు ఎంత వైరలో, ఇప్పుడు ఆయన కొత్త స్టయిల్ అంతే వైరల్ అయి, టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. దక్షిణాది బాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన సూర్య, ‘సింగం’ చిత్రాల్లో మాదిరిగా, ధోనీ తన స్టయిల్ ను మార్చుకున్నారు. ఇక, ఈ చిత్రాలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -