‘మహావీరుడు’ కథ ఇదేనా!

32
- Advertisement -

హీరో శివ కార్తికేయన్ కథానాయకుడిగా, మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ మహావీరుడు. అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 14న మహావీరుడు విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఆసక్తికరవార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ న్యూస్ పేపర్ కార్టూనిస్ట్ అయ్యిన ఓ యువకుడు తన తలకి ఓ పెద్ద గాయం అయ్యిన తర్వాత ఓ గొంతుని అయితే తరచూ వింటూ ఉంటాడు ఆ వాయిస్ ఓవర్ ని తమిళ్ లో విజయ్ సేతుపతి అందించగా తెలుగులో రవితేజ అందించారు.మరి ఈ వాయిస్ చెప్పే మాటలు ఏంటి? అందులో పొలిటికల్, యాక్షన్ సహా భయంకరమైన వైలెన్స్ ఎలా జెనరేట్ అవుతుంది అనేది పాయింట్ అట.

Also Read:రాజకీయాలు అనగానే హీరో పై ఫైన్

- Advertisement -