మహావతార్..హిందీలోనూ అదుర్స్!

10
- Advertisement -

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మహావతార్ నరసింహ. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకొని, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది

ఇక హిందీ మార్కెట్ లో అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక రెండో సోమవారం వచ్చేసరికే చాలా సినిమాలు రన్ పూర్తయ్యిపోతుంది. అలాంటిది మహావతార్ నరసింహ ఒక్క హిందీ వెర్షన్ లోనే 5 కోట్లకి దగ్గరగా నెట్ వసూళ్లు అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మంగళవారం కూడా ప్రతీ గంటకి 10 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ లెక్కన ఈ డివోషనల్ చిత్రం ప్రేక్షకులని ఏ రకంగా ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ 100 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న ఈ సినిమా నెక్స్ట్ 200 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉన్నాయి.

Also Read:వీసా గడువు ముగిసినా ఉంటే…వేటే!

- Advertisement -