ఓటీటీ లవర్స్‌కి పండగే!

7
- Advertisement -

ఈ ఆగస్టులో పలు సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని సినిమాలు స్ట్రీమింగ్‌లో ఉండగా మరికొన్ని స్ట్రీమింగ్ తేదీలు ఖరారయ్యాయి.నితిన్ నటించిన తమ్ముడు బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించకపోయినా, ఇప్పుడు ఆగస్టు 1, 2025 నుంచి Netflixలో మల్టిపుల్ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

అలాగే సిద్ధార్థ్ నటించిన 3BHK, శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కింది. తమిళంలో హిట్‌గా నిలిచిన ఈ మధ్యతరగతి భావోద్వేగాత్మక డ్రామా, తెలుగులోనూ ఓ మోస్తరైన విజయం సాధించింది. ఇది ఇప్పుడు Amazon Prime Videoలో తమిళం మరియు తెలుగు భాషలలో అందుబాటులో ఉంది.

ఆమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర ట్రెడిషనల్ ఓటీటీలను తప్పుకొని ప్రత్యేకంగా YouTube రెంట్ ద్వారా విడుదల అయింది.ప్రముఖ హాస్యప్రధాన హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో ఐదవ భాగంగా వచ్చిన హౌస్‌ఫుల్ 5A & 5B రెండు వేరే క్లైమాక్స్‌లతో విడుదలైంది. తరుణ్ మంసుఖానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, జాకీ శ్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు నటించారు. ఈ చిత్రం Amazon Prime Videoలో హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

మూడేళ్ల విరామం తర్వాత, Wednesday సిరీస్ రెండవ సీజన్‌తో తిరిగి వస్తోంది. జెన్నా ఒర్టేగా మళ్లీ Wednesday Addams పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 6, 2025న మొదటి నాలుగు ఎపిసోడ్‌లు (Part 1) Netflixలో ఇంగ్లిష్, తెలుగు, మరియు ఇతర భాషలలో స్ట్రీమింగ్ కానున్నాయి.

దేవ కట్ట సృష్టించిన రాజకీయ నాటక శ్రేణి మాయాసభలో చైతన్యరావు మరియు ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఇది రాజకీయంగా శక్తివంతమైన కుటుంబాలకు చెందిన ఇద్దరు బాల్యమిత్రులైన నాయుడు మరియు రెడ్డి మధ్య ఏర్పడిన పగను చర్చిస్తుంది. ఈ సిరీస్ ఆగస్టు 7, 2025నుంచి Sony LIVలో ప్రసారం కానుంది.

సత్యదేవ్ మరియు ఆనంది నటించిన కొత్త తెలుగు సిరీస్ అరేబియా కడలిను Amazon Prime Videoలో విడుదల చేస్తున్నారు. ఆగస్టు 8, 2025న మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. యూట్యూబ్ వీడియోలతో ప్రసిద్ధి పొందిన అనిల్ గీలా, ఇప్పుడు ZEE5లో OTT అరంగేట్రం చేస్తుండగా, ఆయన కథానాయకుడిగా నటించిన మోతేవారి లవ్ స్టోరీ గ్రామీణ నేపథ్యంలోని ప్రేమకథ.. ఆగస్టు 8, 2025న ZEE5లో విడుదలవుతుంది.

Also Read:వీసా గడువు ముగిసినా ఉంటే…వేటే!

సూరి మరియు ఐశ్వర్య లక్ష్మి నటించిన తమిళ ఫ్యామిలీ డ్రామా మామన్ బాక్సాఫీస్‌ వద్ద ఆశ్చర్యకర విజయం సాధించింది. ఈ చిత్రం ZEE5లో ఆగస్టు 8, 2025న విడుదల అవుతుంది. అలాగే తెలుగు డబ్ వెర్షన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.నవీన్ కస్తూరియా, మౌని రాయ్, ముఖేష్ రిషి నటించిన హిందీ థ్రిల్లర్ డ్రామా సలాకార్ ఆగస్టు 8, 2025న Jio Hotstarలో విడుదల అవుతోంది.

- Advertisement -