సర్వమానావళికి శాంతి ఆహింస సత్యగ్రహం అను ఆయుధాలను ఇచ్చిన మహానీయుని విగ్రహాలు ద్వంసం చేస్తున్నారు. తాజాగా అమెరికాలో న్యూయార్క్ నగరంలోని తులసీ మందిర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహాంను గుర్తు తెలియని దుండగులు ద్వంసం చేశారు.ఈ నెల 16వ తేదీన దుండగులు ఈ విగ్రహాన్ని సుత్తితో ద్వంసం చేశారు. అనంతరం అక్కడ విద్వేష పదాలు రాశారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి త్వరలో నిందితులను పట్టుకుంటుమాన్నారు ఎన్‌వైపీడీ. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల ఉందని, వారిని పట్టుకోవడానికి గాలింపులు చేస్తున్నట్లు తెలిపారు.
న్యూయార్క్ రిచ్ మండ్ హిల్స్‌లోని తులసి మందిర్ వద్ద నున్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం రెండు వారాల్లో ఇది రెండోసారి. గతంలో ఈ నెల 3వ తేదీన విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దాన్ని తిరిగి మరమ్మత్తులు చేసి పునఃప్రతిష్టించారు. కానీ అంతలోనే ఆదే విగ్రహాన్ని రెండవ సారి ధ్వంసం చేశారు. దీనిపై న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. నేరస్థులను త్వరితగతిన పట్టుకోవాలని చట్ట ప్రకారం వారిని శిక్షించాలని కోరారు. ఈ మేరకు దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్ లోని మాన్ హట్టన్ లో, జూలై 14న కెనాడాలో ఉన్న గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడంపై నిరసన వ్యక్తమైంది.